Breaking News

స్టాక్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం..150 కోట్లతో పరార్

Published on Sat, 05/31/2025 - 07:01

జీడిమెట్ల(హైదరాబాద్): పెట్టుబడి పెట్టిన సొమ్ముకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి ది పెంగ్విన్ సెక్యూరిటీస్‌ సంస్థ టోకరా వేసింది. మూడు నెలలుగా రిటర్న్స్‌ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా రూ.6.5కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది.

బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గిరినగర్‌కు చెందిన బాలాజీ, మెదక్‌ జిల్లా, అల్లాదుర్గ్‌ ప్రాంతానికి చెందిన స్వాతి మూడేళ్ల క్రితం చింతల్‌ గణేష్‌ నగర్‌లోని ఓ కాంప్లెక్స్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్‌ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. 

పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్‌ పెపర్లపై నోట్‌ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచి్చన మొత్తానికి 20నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే గాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థవారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5శాతం కమీషన్‌ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి మూడే బ్రాచీలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత మూడు నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆపేసింది. 

ఈ విషయమై పలువురు సంస్థ కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా ఈనెల షేర్‌ మార్కెట్‌ బాగాలేదు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. శుక్రవారం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొందరు ఇన్వెస్టర్లు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో  నిర్వాహకులను ఫోన్‌ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు డిపాజిట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. బాధితులు సంఖ్య పెరిగితే కేసును ఈవోడబ్ల్యూఎస్‌కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా  1500 మందికి పైగా సదరు సంస్థలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి,సిటీబ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని  కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి హెచ్చరించారు. స్కానింగ్‌ సెంటర్లలో అర్హులైన డాక్టర్లు , అనుమతి పొందిన స్కానింగ్‌ మిషన్లు మాత్రమే ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కేంద్రాలపై డేకాయ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 15 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపారు.

సికింద్రాబాద్‌ లోని న్యూ లైఫ్‌ ఆసుపత్రిలో అనుమతి లేని స్కానింగ్‌ మిషన్‌ ను గుర్తించి సీజ్‌ చేసి యాజమాన్యంపై సు నమోదు చేయాలని, సైదాబాద్‌లోని వివేకాసుపత్రిలో అనుమతి లేకుండా రెండు స్కానింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసినందుకు రూ.2లక్షలు జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 26 స్కానింగ్‌ సెంటర్లకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించాలన్నారు.  నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్‌ సెంటర్ల  రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలన్నారు. సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్లు  జిల్లా ప్రోగ్రాం అధికారులు అన్ని స్కానింగ్‌ సెంటర్లను  తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలన్నారు. 

లింగ నిర్ధారణ పరీక్షల సమాచారంపై టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 599 3366 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ వెంకటి, ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి  స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వందన, సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్లు, జిల్లా మీడియా అధికారి జక్కుల రాములు, టి నరసింహ, అంజయ్య గౌడ్‌ పాల్గొన్నారు.

 

Videos

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

Photos

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)