Breaking News

వర్సిటీల్లో నియామకాలకు కమిటీ

Published on Sat, 12/14/2024 - 05:17

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరిధిలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకా­లు చేపట్టేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు సిఫారసు చేసేందుకు ఉన్నత విద్యామండలి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది. అంబేడ్క­ర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ఘంటా చక్ర­పాణి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫె­సర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ సభ్యులుగా ఉంటా­రు. మరో ఇద్దరు సభ్యులను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. నియామకాలకు సంబంధించిన సూచనలతో పాటు, కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (సీఏ­ఎస్‌), ప్రమోషన్లకు సంబంధించిన అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను సైతం ఈ కమిటీ పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తుంది. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  

అన్నీ పరిశీలించాకే.. 
యూనివర్సిటీల్లో దాదాపు 3 వేల బోధన సి­బ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా గతంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు వీలుగా కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే దీని స్థానంలో కాలేజ్‌ సరీ్వస్‌ కమిషన్‌ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాలన్నీ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నత విద్యా మండలికి విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. వీసీల సమావేశం వివరాలను మండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి మీడియాకు వివరించారు. 

ర్యాంకింగ్‌లపైనా కమిటీ! 
యూనివర్సిటీల స్థితిగతులు, నాణ్యత ప్రమా­ణా­­లు, అనుబంధ గుర్తింపు విధానాలపై వీసీల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. తమ వర్సిటీల పరిధిలో సమస్యలను వీసీలు సమావేశంలో లేవనెత్తారు. జాతీయస్థాయిలో ర్యాంకు­లు పడిపోవడానికి కారణాలు, వీటిని ఏ విధంగా మెరుగుపర్చాలనే అంశంపై ఓ కమిటీని ఏ­ర్పా­టు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. వర్సిటీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న నిధుల కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మా­ర్గాలను అన్వేíÙంచాలని విద్యాశాఖ కార్యద­ర్శి సూచించారు. పరిశ్రమల నుంచి సామాజిక బాధ్యత కార్యక్రమం కింద, పార్లమెంట్‌ సభ్యుల ప్రాంతీయ అభివృద్ధి నిధుల ద్వారా లబ్ధి పొందే అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.  

సిలబస్‌ మార్పుపై కసరత్తు పూర్తి 
కొన్ని నెలలుగా ఉన్నత విద్యా మండలి చేపట్టిన పలు కార్యక్రమాలను వీసీలకు బాలకిష్టారెడ్డి వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే దిశగా సిలబస్‌లో గణనీయ మార్పు తెస్తున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయిందని తెలిపారు. మార్కెట్‌ డిమాండ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ ఉండబోతుందని వివరించారు.  

న్యూస్‌ లెటర్‌ విడుదల 
మండలి నేతృత్వంలో రూపొందిస్తున్న న్యూస్‌ లెటర్‌ను విద్యాశాఖ కార్యదర్శి శ్రీధర్‌ ఈ సందర్భంగా విడుదల చేశారు. మండలి నేతృత్వంలో రాష్ట్ర ఉన్నత విద్యా సంస్థల్లో పురోగతిని ఇందులో వివరించారు. సమావేశంలో ఘంటా చక్రపాణితో పాటు పలు వర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)