Breaking News

ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్‌ సతీమణి ప్రసవం

Published on Thu, 05/29/2025 - 07:36

భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఆ ఆస్పత్రులపై నమ్మకం పెరిగేలా అడుగు ముందుకేశారు. ఆయన భార్య శ్రద్ధ గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరి్పంచగా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ నేతృత్వాన వైద్యులు సరళ, అనూష, హెడ్‌ నర్సు రేవతి బుధవారం ఉదయం 10.03 గంటలకు ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేశారు. 

కలెక్టర్‌ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఉండగా, రెండో కాన్పులోనూ పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్‌ తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోవడమే కాక వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉన్నందున ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు.  

అభినందనలు తెలిపిన మంత్రులు 
కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో ఆయనను ప్రశంసించారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబీకులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)