Breaking News

బాబోయ్‌ చలి.. అప్పటి దాకా అంతే.. తెలంగాణకు హెచ్చరిక

Published on Sun, 11/09/2025 - 19:42

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 11 నుండి 19 వరకు.. ముఖ్యంగా 13 నుండి 17 నవంబర్ మధ్య కాలంలో తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం చలి తీవ్రత కనిపించదు. కానీ ఈ సంవత్సరం 8–10 రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతోందని అంచనా.

పైన ఫొటోలో పింక్,బ్లూ కలర్‌లో సూచించిన జిల్లాలు:
ఇక్కడ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌ (10°C కంటే తక్కువ) వరకు పడిపోవచ్చు. ఈ ప్రాంతాల్లో ఉదయపు వేళల్లో తీవ్రమైన చలి ఉంటుంది. బ్లూ కలర్ జిల్లాలు (హైదరాబాద్ సహా): ఉష్ణోగ్రతలు 11°C–14°C మధ్య ఉండే అవకాశం. మోస్తరు చలి, కానీ ఉదయపు వేళల్లో జాగ్రత్త అవసరం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలోని దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో ఇక్కడ మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C–17°C మధ్య ఉండవచ్చు. ఈ ప్రాంతాల్లో చలి ప్రభావం తక్కువగా ఉండే అవకాశం.

జాగ్రత్తలు అవసరం
ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తగు సూచనలిచ్చింది. ఉదయపు, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు చలి నుంచి సంరక్షించేలా వస్త్ర రక్షణ తప్పనిసరి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరం. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి, అధికారుల సూచనలు పాటించాలి.

వాతావరణ శాఖ అంచనా:
ఉత్తరాది నుంచి వచ్చే వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కంటే 3°C–5°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అందుకే ప్రజలు ఈ చలి తీవ్రతను తేలికగా తీసుకోకుండా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)