Breaking News

నలుగురా.. ఐదుగురా..?

Published on Mon, 05/26/2025 - 06:02

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా చర్చోపచర్చలకు తావిస్తున్న మంత్రివర్గ విస్తరణపై హస్తిన వేదికగా మరోమారు కసరత్తు మొదలైంది. నీతి ఆయోగ్‌ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆదివారం గంటపాటు చర్చించారు. ఆశావహుల సామాజిక వర్గాలు,స్థానిక బలాబలాలను పరిగణనలోకి తీసుకొని చర్చించారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో సోమవారం కూడా భేటీ కొనసాగనుంది. 

సామాజిక వర్గాలవారీగా విశ్లేషణ 
రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందే నేతల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే తీసుకొనేది నలుగురినా లేక ఐదుగురినా? అనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్‌ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్, కరీంనగర్‌ జిల్లా నుంచి ఆదిశ్రీనివాస్, మైనారిటీ కోటాలో షబ్బీర్‌ అలీ, ఆమేర్‌ అలీఖాన్‌ల పేర్లు ఉన్నాయి. 

వారితోపాటే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును పరిశీలించినట్లు సమాచారం. ఇందులో ఓసీల నుంచి రెడ్డి అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలతోపాటు వెలమ అయితే ప్రేమ్‌సాగర్‌రావు, ఎస్సీ అయితే గడ్డం వివేక్, ఎస్టీ అయితే బాలూనాయక్, శంకర్‌ నాయక్, ఓబీసీ నుంచి వాకాటి శ్రీహరి, విజయశాంతిల పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మైనారిటీ కోటాలో షబ్బీర్‌ అలీ, ఆమేర్‌ అలీఖాన్, ఫహీమ్‌ ఖురేïÙల పేర్లు ఉన్నాయి. 

నేడు రాహుల్‌ సమక్షంలో చర్చలు.. 
మంత్రివర్గ కూర్పుపై స్పష్టత రాకపోవడంతో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సోమవారం మరోసారి భేటీ కానున్నారు. కేసీ వేణుగోపాల్‌తోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాం«దీని వారిద్దరూ కలిసి మంత్రివర్గ అంశం, పీసీసీ కార్యవర్గంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 

ఈ భేటీల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం వాయిదా పడింది. మంత్రివర్గ అంశంలో అధిష్టానం వద్ద గ్రీన్‌ సిగ్నల్‌ లభించాక సీఎం హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. కాగా, కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ అంశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చ జరిగింది.   

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)