Breaking News

రైతు భరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

Published on Sat, 01/04/2025 - 21:21

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ  రైతు భరోసా ఇస్తామని.. గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

భూమిలేని వ్యవసాయ కుటుంబాలకూ ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని రేవంత్‌ తెలిపారు. రేషన్‌కార్డు లేని వారందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆరోజును మేం ఎంచుకున్నాం. రాళ్లు, రప్పలు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబడదు. గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించి ప్రజలకు అన్నివిషయాలు వివరిస్తారు.’’ అని రేవంత్‌ చెప్పారు.

కేబినెట్‌ కీలక నిర్ణయాలు

  • వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా
  • ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం
  • భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు
  • సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ
  • రైతు భరోసాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం
  • జనవరి  26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ
  • ములుగు మున్సిపాలిటీకి కేబినెట్‌ ఆమోదం
  • పంచాయతీ రాజ్‌లో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం
  • 200 కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్‌ ఆమోదం
  • మరో 11 కొత్త మండలాలకు కేబినెట్‌ ఆమోదం

ఇదీ చదవండి: ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం

 

 

 

 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)