Breaking News

మనం చేసినవన్నీ యువతకు చెప్పండి

Published on Thu, 02/20/2025 - 04:50

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి యువతకు వివరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్ట­భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి అవకాశా­లు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థి వి.నరేందర్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. 

కరీంనగర్‌–ఆదిలాబాద్‌–నిజామాబాద్‌–మెదక్‌ ఉమ్మడి జి­ల్లా­­ల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్‌ ముఖ్యనేతల జూమ్‌ మీటింగ్‌ టీపీసీసీ అధ్య­క్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమా­వేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవ­న్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

సమా­వేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలో స్కిల్స్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోని యువ­తకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు లక్షల కోట్ల రూ­పా­యల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఈ విషయా­లను యువతకు వివరించడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపు­నకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ అంటే అభిమానం: మీనాక్షి 
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్‌ తొలిసారి పార్టీ సమావేశంలో పాల్గొన్నా­రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. రాష్ట్రంలోని చాలా­మంది పార్టీ నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నా­యని అన్నారు. 

తెలంగాణను దేశానికి ఒక మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని పార్టీ నాయకులందరూ కలిసి­కట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. ఎన్నికలను పార్టీ కేడర్‌ ప్రతిష్టాత్మకంగా తీసు­కోవాలని మీనాక్షి చెప్పారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)