Breaking News

8న యాదాద్రికి సీఎం రేవంత్‌

Published on Mon, 11/04/2024 - 02:03

సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన యాదాద్రి జిల్లా పర్యటనకు రానున్నారు. అదేరోజు ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీఏ, జిల్లా అధికారులతో సమావేశమై యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా మిగిలిపోయిన పనులు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్లు తెలిసింది. 

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు మంచినీటిని సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్‌ ప్రాజెక్టు పైలాన్‌ను యాదాద్రిలో సీఎం ప్రారంభిస్తారు. పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు. పైప్‌లైన్‌ ద్వారా 550కి పైగా గ్రామాలకు తాగునీరు అందిస్తారు.

మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి నియోజకవర్గంలోని బొల్లేపల్లి– సంగెం మధ్య భీమలింగం బ్రిడ్జి వద్దనుంచి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో కూడా సీఎం పర్యటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)