Breaking News

21న ఓయూకు సీఎం రేవంత్‌రెడ్డి

Published on Mon, 08/18/2025 - 04:40

సాక్షి, హైదరాబాద్‌/ఉస్మానియా యూనివర్సిటీ:  ఓయూ క్యాంపస్‌లో నిర్మించిన కొత్త హాస్టల్‌ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగరం, ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సి.కాశీం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలసి 21వ తేదీన ప్రారంబోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహా్వనించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓయూలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ప్రారంభించడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు కొత్త హాస్టల్‌ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 కోట్ల నిధులతో డిజిటల్‌ లైబ్రరీ రీడింగ్‌ రూం పనులను సైతం సీఎం ప్రారంభించనున్నారు.

అనంతరం ఓయూలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’అనే అంశంపై ముఖ్యమంత్రి.. ప్రొఫెసర్లు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, గత ఇరవై ఏళ్ల కాలంలో ఓయూకు ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగించడం ఇదే ప్రథమమని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘సీఎం రీసెర్చ్‌ ఫెలో షిప్‌’తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని వీసీ తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)