Breaking News

10లోగా పర్యాటక పాలసీ: సీఎం రేవంత్‌

Published on Thu, 01/30/2025 - 00:44

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి సంబంధించి సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి పదో తేదీలోగా సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాలను ప్రాతిపదికగా చేసుకొని పాలసీని రూపొందించాలని సూచించారు. బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న పర్యాటక పాలసీలపై అధ్యయనం చేసి, అనుసరించదగ్గ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి దేశీ, విదేశీ పర్యాటకులు వచ్చేలా చూడాలన్నారు. పర్యాటక రంగంలో బహుళ జాతి కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని, దీనితో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడి, పర్యాటకులను ఆకట్టుకోవటానికి వీలవుతుందని స్పష్టం చేశారు. 

పర్యాటక ఆదాయం పెరగాలి 
కవ్వాల్, అమ్రాబాద్‌ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘‘మేడారం, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్క్యూట్‌గా తీర్చిదిద్దాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో కేరళ తరహాలో బోట్‌హౌస్‌లతో పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలి. రాష్ట్రంలోని బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలి. సమ్మక్క–సారలమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలి..’’అని సూచించారు. 

హైదరాబాద్‌ నగరంలోని ఎనీ్టఆర్‌ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కైవాక్, సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలన్నారు. అనంతగిరితోపాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో వసతులు మెరుగుపర్చాలని చెప్పారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచీ ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు 
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును సత్వరం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దీనితోపాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)