Breaking News

రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం

Published on Tue, 05/28/2024 - 06:28

సాక్షి, హైదరాబాద్‌: రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నం రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర అధికారిక చిహ్నం రూపకల్పనపై చ ర్చించారు. రాజేశం రూపొందించిన పలు నమూనాలను పరి శీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు.

గత బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర అధికార చిహ్నంలో చారి్మనార్‌తో పాటు కాకతీయ కళాతోరణం గుర్తు లు ఉండగా, వాటిని రాచరిక ఆనవాళ్లుగా పరిగణించి, కొత్త అధికారిక చిహ్నాన్ని రూపొందించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి కేబినెట్‌ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కాగా జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త అధికారిక చిహ్నంతో పాటు రాష్ట్ర గేయం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి ని ర్ణయం తీసుకున్నారు. అయితే కొత్త అధికారిక చిహ్నం రూపకల్పన కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జూన్‌ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో దీనిని ఆవిష్కరించే అవకాశాలు అంతగా లేనట్టేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

రాష్ట్ర గేయం ఆవిష్కరణకు ఏర్పాట్లు 
‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ఎంపిక చేసిన ప్రభుత్వం, జూన్‌ 2న నిర్వహించే బహిరంగ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ చేతుల మీదుగా దానిని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందెశ్రీ రాసిన ఈ గేయాన్ని ఎలాంటి మార్పులు లేకుండా రాష్ట్ర గేయంగా ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. అయితే 13 నిమిషాల నిడివి కలిగిన ఈ గేయాన్ని అంతర్జాతీయ అతిథులు పాల్గొనే కార్యక్రమాల్లో పాడడానికి వీలుగా సంక్షిప్తీకరించి మరో వెర్షన్‌ను సైతం రూపొందించాలని సీఎం గతంలో  అందెశ్రీకి సూచించారు.  

నేడు సోనియాకు ఆహ్వానం 
జూన్‌ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా సోనియాను ముఖ్యమంత్రి కోరనున్నారు. మంగళవారం ఢిల్లీలో ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పలకనున్నారు. సోమవారం కేరళ వెళ్లిన సీఎం అటు నుంచి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చన సోనియాగాం«దీని జూన్‌ 2న జరిగే వేడుకలకు ఆహ్వానించి, ఆమె చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)