Breaking News

సిగాచి మృతులకు కోటి రూపాయల పరిహారం: సీఎం రేవంత్‌

Published on Tue, 07/01/2025 - 12:38

సాక్షి, సంగారెడ్డి: ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదని పటాన్‌చెరు పాశమైలారం ఫ్యాక్టరీ ప్రమాదాన్ని ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలిని పరిశీలించి.. అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం బాధాకరం. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 147 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 57 మంది బయటపడ్డారు. అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాం. చనిపోయినవారి కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశించాను. ఈ విషయమై ప్రభుత్వం తరఫున మంత్రులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించనున్నారు. అలాగే.. తీవ్రంగా గాయపడిన వాళ్లకు రూ.10 లక్షల సాయం అందించాలని ఆదేశించాను. గాయపడి.. కోటుకుని తిరిగి పని చేయలేని స్థితిలో ఉన్నబాధితులకు సైతం రూ.10 లక్షలు కచ్చితంగా ఇప్పిస్తాం. తక్షణ సాయం కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు రూ.లక్ష, గాయపడినవాళ్లకు రూ.50 వేలు అందిస్తాం. బాధితులను ఆదుకునేందుకు యాజమాన్యం ముందుకు రావాలి.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవత్వంతో అన్ని విధాల ఆదుకుంటుంది.  మృతుల్లో తమిళనాడు, బీహార్‌, జార్ఖండ్‌ వాసులు అధికంగా ఉన్నారు. మృతదేహాల స్వస్థలాల తరలింపునకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. మృతుల కుటుంబాల పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.

..ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటిదాకా జరగలేదు. యాజమాన్యాలు ఇక నుంచి భద్రతపై ఫోకస్‌ చేయాలి. ప్రమాదాలను నివారించాలి. ప్రమాదాలు జరగకుండా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి. నిర్లక్ష్యం ఉంటే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇప్పటకే ప్రభుత్వం తరఫున అత్యున్నత దర్యాప్తు జరిపిస్తున్నాం అని సీఎం రేవంత్‌ అన్నారు.

Pashamylaram Incident: మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)