Breaking News

నిజమైన పాత్రికేయులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌

Published on Mon, 09/09/2024 - 05:30

సాక్షి, హైదరాబాద్‌: నిజమైన పాత్రికేయులను అగౌరవపరిచే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. వారికి అన్నివేళలా అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవస్థపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్స్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి కేటాయించిన 38 ఎకరాల భూపత్రాలను ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ‘ప్రజాప్రభుత్వంలో పాత్రికేయులు’ కార్యక్రమంలో సొసైటీకి సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జేఎన్‌జే సొసైటీలో సభ్యులు కాని ఇతర జర్నలిస్టులకు ఫ్యూచర్‌ సిటీలో న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సిటీ నిర్మాణంలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలని కోరారు. మీడియా అకాడమీకి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు.  

పాత్రికేయులకు స్వేచ్ఛ 
యాజమాన్యాల విధానాలు ఏ విధంగా ఉన్నా, పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను అర్థం చేసుకొని, వారికి సంక్షేమం అందించడంలో ముందుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనేక ఆంక్షలుండేవని, తమ ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఈ మార్పు సమాజానికి నష్టాన్ని, తమకు కష్టాన్ని తెచ్చేలా ఉండకూడదన్నారు. పత్రికా సమావేశాల్లో ఆ ట్యూబ్‌...ఈ ట్యూబ్‌ అంటూ నిజమైన పాత్రికేయులకన్నా వారే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. 

ఏమన్నా అంటే పత్రికలపై దాడి అని అల్లరి చేస్తున్నారని, వారు ఏం అడుగుతారో.. ఏం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఎవరిని జర్నలిస్ట్‌గా చూడాలో పాత్రికేయులే చెప్పాలన్నారు. పాత్రికేయుల ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్‌ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త విధానాలు రూపొందించాలని మీడియా అకాడమీని సీఎం ఆదేశించారు. కొంతమంది పాత్రికేయులు విలువల్లేకుండా రాజకీయ పార్టీల యజమానులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని, భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం నడుపుతున్న పత్రికల పోకడలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఉన్మాద ధోరణితో వెళుతున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని కోరారు. పాత్రికేయుల ఇళ్ల స్థలాల అప్పగింత విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ గ్రామీణ విలేకరులకు కూడా స్థలాలు ఇవ్వాలన్నారు. 

అనంతరం మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సాయం సీఎం రేవంత్‌రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, జేఎన్‌జే నాయకులు కిరణ్‌కుమార్, రవికాంత్‌రెడ్డి, వంశీశ్రీనివాస్, రమణారావు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)