Breaking News

చిన్న పొరపాటూ జరగొద్దు

Published on Mon, 11/24/2025 - 02:24

సాక్షి, రంగారెడ్డి జిల్లా/కందుకూరు: డిసెంబర్‌ 8, 9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, అందువల్ల భద్రతా పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన గ్లోబల్‌ సమ్మిట్‌ జరిగే కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సందర్శించారు. మధ్యాహ్నం హెలీకాప్టర్‌లో పుట్టపర్తి నుంచి ఫ్యూచర్‌సిటీ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించే ప్రదేశానికి చేరుకున్నారు.

అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. గంటకు పైగా అక్కడ గడిపిన ముఖ్యమంత్రి సమ్మిట్‌ ఏర్పాట్ల గురించి తెలుసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. ‘సమ్మిట్‌కు ఫారŠూచ్యన్‌– 500 కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్న సమయంలో ఏ చిన్న సమస్య కూడా ఉత్పన్నం కావొద్దు. మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ పడొద్దు. మూసీ ప్రక్షాళనలో భాగంగా శుభ్రం చేసిన నీటిని ఫ్యూచర్‌ సిటీ అవసరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలి..’అని ఆదేశించారు

అపరిచితులను అనుమతించొద్దు
మీర్‌ఖాన్‌పేట నుంచి సమీపంలోని స్కిల్స్‌ యూనివర్సిటీకి చేరుకున్న సీఎం.. అక్కడ కొనసాగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏఫ్‌సీడీఓ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడుతూ గ్లోబల్‌ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని కోరారు. మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గుర్తింపు కార్డులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌ చల్లా నర్సింహారెడ్డి తదితర నేతలు, కలెక్టర్‌ నారాయణరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)