Breaking News

21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి

Published on Mon, 10/20/2025 - 03:45

చార్మినార్‌: రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయేరోజుల్లో తాము శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఆది వారం చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి..కేంద్ర మాజీమంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఓటుహక్కు వయసు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్‌ హోదాల్లో ప్రజాసేవ చేస్తుండగా, రాజకీయాల్లో మాత్రం ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాహుల్‌గాంధీ భారత్‌ జూడోయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ప్రస్తుతం కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ కేవలం మన రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, మదన్‌మోహన్, బల్మూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి