Breaking News

గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం

Published on Sun, 05/18/2025 - 20:16

సాక్షి,  హైదరాబాద్‌: గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని రేవంత్‌ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు.

ఫైర్​ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని.. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని సీఎం రేవంత్‌ అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక బృందం తమ శక్తియుక్తులు ప్రయత్నించిందన్నారు. కాగా, చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతి చెందిన వారిలో రాజేంద్రకుమార్‌ (67),అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు.  ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండటంలో భారీ ప్రాణనష్టం జరిగింది.   

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)