Breaking News

గడువులోగా పూర్తి చేయాలి

Published on Sat, 11/16/2024 - 03:02

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సర్వే ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని, నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

మొదటి దశలో చేసిన నివాసాల లిస్టింగ్‌ ప్రక్రియలో భాగంగా 1,16,14,349 ఇళ్లకు స్టిక్కరింగ్, మార్కింగ్‌ చేశామని తెలిపారు. వాటిలో ఏ ఒక్క ఇంటినీ వదిలేయకుండా.. ప్రతి ఇంటిలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరుల అభ్యున్నతి కోసమే వివరాల సేకరణ జరుగుతోందని చెప్పారు. సర్వేను రాష్ట్ర గవర్నర్‌ వివరాల సేకరణతో ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు..
సమగ్ర సర్వేలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని సీఎం పేర్కొన్నారు. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

44.1 శాతం పూర్తయింది..
శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం సర్వే పూర్తయిందని.. సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 మంది పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రజల నుంచి స్పందన బాగుందని వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)