Breaking News

గోశాలల విస్తీర్ణం 50 ఎకరాలకు తగ్గొద్దు

Published on Sun, 06/01/2025 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: గోవుల సంరక్షణ సులువుగా ఉండేలా గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోశా లల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో భాగంగా పశువైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాటి అనుబంధ కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. గోశాలల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, నిర్ణీత గడువులోగా ఈ కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధం కావాలని కోరారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. 

గోవులు స్వేచ్ఛగా తిరిగేలా ఉండాలి
ఇరుకు స్థలాల్లో బంధించినట్టుగా కాకుండా.. గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలల్లో మార్పులు తేవాలని సీఎం సూచించారు. గోశాలల నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సమీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. 

షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. ఈ గోశాల తుది డిజైన్‌ను నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనుంది. సమావేశంలో సీఎం కార్యాలయ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్‌రాజ్, అజిత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్‌ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.   

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)