Breaking News

కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Published on Fri, 08/23/2024 - 17:32

సాక్షి, ఢిల్లీ: కేంద్ర టెలికం, కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క శుక్రవారం భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భార‌త్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు స‌మ‌ర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వ‌ర్క్ కల్పించడం  టీ-ఫైబర్ లక్ష్యమన్నారు. టీ-ఫైబర్‌ ప్రధాన ఉద్ధేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందిస్తామని రేవంత్‌ చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300 కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యం. టీ-ఫైబర్‌ అమలుగానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌ర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్‌కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)