Breaking News

గోండు భాషలో ప్రాథమిక విద్య

Published on Sat, 01/11/2025 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీలకు గోండు భాషలో ప్రాథమిక విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను సంఘాల నేతలు సీఎం వద్ద ప్రస్తావిస్తూ వినతులు సమర్పించారు. 

ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలోని ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని అప్పట్లోనే నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేశాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.

విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను క్లియర్‌ చేస్తాం. ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. కేస్లాపూర్‌ జాతరకు నిధులు మంజూరు చేస్తాం. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేస్తాం. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్‌ పంపుసెట్లు ఉచితంగా అందిస్తాం’ అని సీఎం వారికి హామీనిచ్చారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)