Breaking News

త్వరలో కాళేశ్వరం బ్యారేజీల పరిశీలన

Published on Sun, 05/19/2024 - 04:51

సాక్షి, హైదరాబాద్‌:  మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండగా, ఆలోగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతుతపై రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు.

బ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలా? ఇతర ప్రత్యా మ్నాయాలు ఏమైనా ఉన్నాయా? బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలి? అనే అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి నిర్ణ యాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 

త్వరలో కాళే శ్వరం బ్యారేజీలు, వాటికి సంబంధించిన పంప్‌ హౌస్‌లను పరిశీలి స్తామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో సీఎం, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మ ల నాగేశ్వ రరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

నిపుణుల కమిటీ సిఫారసులు వివరించిన ఉత్తమ్‌
గతేడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పలుమార్లు బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను, తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫారసు చేసింది. ఈ అంశాలన్నిటినీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం, ఇతర మంత్రులకు వివరించారు. 

2019లోనే బ్యారేజీలు ప్రమాద సంకేతాలు వెలువరించాయని, ఇప్పుడు మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా మేడిగడ్డ బ్యారేజీకి ముప్పు ఉండదనే అంశాన్ని తోసిపుచ్చలేమని నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్టుగా మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.     

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు