Breaking News

సకల హంగులతో ఉస్మానయా

Published on Fri, 01/31/2025 - 05:43

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఉస్మానియా ఆసుప్రతిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2 వేల పడకలతో గోషామహల్‌ స్టేడియంలో ఏర్పాటు కానున్న ఈ ఆసుపత్రి భవనానికి శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది.  
మల్టీ లెవల్‌ పార్కింగ్‌  
మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ‘ఏ’బ్లాకును నిర్మించనున్నారు. అదే విధంగా 7.81 ఎకరాల్లో ‘బీ’బ్లాకు ను నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో ‘సీ’బ్లాకు, 0.64 ఎకరాల్లో ‘డీ’బ్లాక్, 0.22 ఎకరాల్లో ‘ఈ’బ్లాకును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మిగిలిన స్థలంలో మిగతా బ్లాకులు నిర్మిస్తారు. ఇన్‌పేషంట్, అవుట్‌ పేషంట్‌ సరీ్వసులతో అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సౌకర్యంతోపాటు లాండ్‌ స్కేపింగ్, గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది. 

సహాయకులకు ధర్మశాల ఉచిత భోజనం 
ఓపీ, ఐపీ సేవలతో పాటు క్లిష్టమైన మూత్రపిండాలు, కాలేయం, స్కిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్చురీ, ఒకే గొడుగు కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఏకకాలంలో 3000–5000 మంది ఒకేచోట కూర్చొనే సామర్థ్యంతో కూడిన వెయిటింగ్‌ హాల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, దంత వైద్య కళాశాల కూడా ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.

మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు రోగుల సహాయకులకు ఉచిత భోజనం సరఫరా చేసే ధర్మశాల కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఫైర్‌ స్టేషన్, పోలీసు అవుట్‌ పోస్టు, ఫ్యాకల్టీ రెసిడెన్సీ సహా బోయ్స్, గరŠల్స్‌ హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త భవన నిర్మాణంతో రోగుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయని తెలంగాణ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్‌ బొంగు రమేష్‌ నేతృత్యంలోని వైద్య బృందం గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

వ్యతిరేకిస్తున్న స్థానికులు!
నిజానికి పురాతన భవనం కూల్చాల్సిన అవసరం లేకుండా ప్రస్తుత ప్రాంగణంలోనే మరో కొత్త భవనం నిర్మించేందుకు అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. కులీకుతుబ్‌షా భవనం నుంచి ధోబీఘాట్‌ వరకు 8 ఎకరాల విస్త్రీర్ణం అందుబాటులో ఉందని, ఇక్కడ రెండు భారీ టవర్లు నిర్మించవచ్చని అంటున్నారు. ఇందుకు భిన్నంగా చుట్టూ ప్లైవుడ్‌ గోదాములు, ఇరుకైన రోడ్లతో భారీ ట్రాఫిక్‌ రద్దీ ఉండే ప్రాంతంలో ఉస్మానియా కొత్త భవనం నిర్మించడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకా శం లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు.

ఇక్కడ ఆస్పత్రి నిర్మాణాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టుకు ప్రభుత్వం రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 104 ఎకరాలు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో కోర్టు రాజేంద్రనగర్‌కు తరలి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు మూసీపై ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించి ఈ రెండు వైపులా ఉన్న ఈ రెండు చారిత్రక భవనాలను అనుసంధానించడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)