Breaking News

30 ఏళ్ల కల సాకారమవుతోంది

Published on Sat, 02/01/2025 - 04:57

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతో 30 ఏళ్ల కల సాకారమవుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఉస్మానియా ఆస్పతి భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు.  అనంతరం ఆస్పత్రి నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం  తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. 

ఉస్మానియా ఆస్పత్రి.. అంతర్జాతీయ బ్రాండ్‌
అనంతరం గోషామహల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. వివిధ రకాల కేసులు కోర్టుల్లో ఉండటం వల్ల ఇన్నాళ్లు జాప్యం జరిగిందన్నారు. అఫ్జల్‌గంజ్‌ ఉస్మానియా ఆస్పత్రి అంటే ఒక అంతర్జాతీయ బ్రాండ్‌..ప్రజల ఆరోగ్యానికి భరోసా, అటువంటి ఆస్పత్రిని ఈ ప్రాంతానికి దగ్గర్లోనే నిర్మించాలని గోషామహల్‌ గ్రౌండ్‌ను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా 22 ఎకరాల్లో ఉందని, కొత్త భవన సముదాయానికి 26.32 ఎకరాలు కేటాయించామని, మరో 11 ఎకరాలు గ్రౌండ్‌ కోసం విడిచిపెట్టామని మంత్రి తెలిపారు. ఓపీ, ఐపీ, రెసిడెన్స్, ఆడిటోరియం, అకాడమీ అని ఐదు భాగాలుగా విభజించామన్నారు.

రాబోయే రెండేళ్లలో పనులు పూర్తి చేసి 2 వేల పడకలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉస్మానియా సంబంధిత 9 ఆస్పత్రులు, మరో 8 కొత్త డిపార్ట్‌మెంట్లు కలిపి మొత్తం 40 విభాగాలు ఇక్కడ పనిచేస్తాయని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణ వ్యయం రూ.2,700 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా నాలుగు వైపులా విశాలమైన రహదారులు నిర్మిస్తామని, చిరు వ్యాపారులకు నష్టం లేకుండా అందరికీ మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాటసారులకు ఇబ్బందులు లేకుండా స్కై వాక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యవసర సేవల కోసం హెలీప్యాడ్‌ను నిర్మించనున్నామన్నారు. ఈ శాసనసభలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారని, వారందరికీ ఈ ఆస్పత్రిపై ఆరాటం ఉందన్నారు.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)