Breaking News

గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన

Published on Fri, 01/31/2025 - 12:16

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరల్డ్‌ క్లాస్‌ వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 26.30 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం ప్రభుత్వం చేపడుతోంది. భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్‌ శాంత కుమారి సహా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

కొత్త ఉస్మానియా ఆసుప్రతిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2 వేల పడకలతో గోషామహల్‌ స్టేడియంలో ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది.  

మల్టీ లెవల్‌ పార్కింగ్‌  
మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ‘ఏ’బ్లాకును నిర్మించనున్నారు. అదే విధంగా 7.81 ఎకరాల్లో ‘బీ’బ్లాకు ను నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో ‘సీ’బ్లాకు, 0.64 ఎకరాల్లో ‘డీ’బ్లాక్, 0.22 ఎకరాల్లో ‘ఈ’బ్లాకును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మిగిలిన స్థలంలో మిగతా బ్లాకులు నిర్మిస్తారు. ఇన్‌పేషంట్, అవుట్‌ పేషంట్‌ సరీ్వసులతో అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీ లెవల్‌ పార్కింగ్‌ సౌకర్యంతోపాటు లాండ్‌ స్కేపింగ్, గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది.

సహాయకులకు ధర్మశాల ఉచిత భోజనం 
ఓపీ, ఐపీ సేవలతో పాటు క్లిష్టమైన మూత్రపిండాలు, కాలేయం, స్కిన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్చురీ, ఒకే గొడుగు కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నొస్టిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఏకకాలంలో 3000–5000 మంది ఒకేచోట కూర్చొనే సామర్థ్యంతో కూడిన వెయిటింగ్‌ హాల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, దంత వైద్య కళాశాల కూడా ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.

మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక వసతి గృహం..
మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు రోగుల సహాయకులకు ఉచిత భోజనం సరఫరా చేసే ధర్మశాల కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఫైర్‌ స్టేషన్, పోలీసు అవుట్‌ పోస్టు, ఫ్యాకల్టీ రెసిడెన్సీ సహా బోయ్స్, బాలికల హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త భవన నిర్మాణంతో రోగుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయని తెలంగాణ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్‌ బొంగు రమేష్‌ నేతృత్యంలోని వైద్య బృందం గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)