నేడు 1,034 రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’

Published on Mon, 06/16/2025 - 06:10

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో అధికారులతో కలసి సమీక్షించారు. రైతు వేదికలలో చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లకు మంత్రి తుమ్మల పలు ఆదేశాలు జారీ చేశారు.

రైతునేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలలో ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేశామని, విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో దాదాపు 1,500 మంది రైతులు పాల్గొంటారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ గోపి తెలిపారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించామని, ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, వ్యవసాయరంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు ఇతర రైతుల అనుభవాలను తెలుసుకొన్నారని చెప్పారు. తాజాగా ఈ ‘వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని’, మరొక 1,034 రైతు వేదికలకు కల్పించబోతున్నామని, వీటిని ప్రారంభించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను వ్యవసాయ శాఖ తరఫున ఆహ్వానించామని తెలిపారు. కాగా, రైతు వేదికలకు హాజరైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడనున్నట్లు తుమ్మల తెలిపారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల విజ్ఙప్తి చేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)