Breaking News

రయ్‌ రయ్‌మనేలా

Published on Fri, 03/08/2024 - 03:40

కంటోన్మెంట్‌: ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాజధాని నగరం  హైదరాబాద్‌ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది.

కారిడార్‌ నిర్మాణం ఇలా
రాజీవ్‌ రహదారిపై నిర్మించనున్న కారిడార్‌ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌ సమీపంలోని ప్యా ట్నీ సెంటర్‌ నుంచి మొదలై  కార్ఖానా, తిరు మలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్‌ సమీపంలోని ఓఆర్‌ ఆర్‌ జంక్షన్‌ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్‌ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్‌ కారిడార్‌ 11.12 కిలోమీటర్లు ఉంటుంది.

అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్‌ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తారు. ఎలివేటెడ్‌ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్‌ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్‌ వద్ద), అల్వాల్‌ వద్ద (0.310 కిలోమీటర్‌ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు.

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో.. 
ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌ పర్‌ డే –పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ సమీపంలో 35,825గా ఉంది.

ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మా ర్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలి పోతున్నారు. సమయం హరించుకుపోవడంతో పా టు ఇంధన వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో సమయం కలి సిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ బాధలు తొలగిపోతాయి. 

ముఖ్యాంశాలు...
♦ మొత్తం కారిడార్‌ పొడవు: 18.10 కి.మీ.
♦ ఎలివేటెడ్‌ కారిడార్‌ పొడవు: 11.12 కి.మీ.
♦ అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌: 0.3 కి.మీ.
♦ పియర్స్‌: 287
♦ అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
♦ రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు
♦ ప్రైవేట్‌ ల్యాండ్‌: 83.72 ఎకరాలు
♦ ప్రాజెక్టు వ్యయం:  రూ.2,232 కోట్లు

ఇవీ ప్రయోజనాలు 
♦     రాజీవ్‌ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్‌ వైపు జిల్లాల  ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు చెల్లు
♦     కరీంనగర్‌ వైపు మెరుగైన ప్రయాణం 
♦     ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గనున్న వ్యయం
♦     సికింద్రాబాద్‌ నుంచి ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా ఓఆర్‌ఆర్‌ వరకు చేరుకునే అవకాశం
♦    మేడ్చల్‌–మల్కాజిగిరి–సిద్దిపేట–కరీంనగర్‌–పెద్దపల్లి–మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలు  లబ్ధిపొందనున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)