Breaking News

పనితీరు కనబరిచినందుకు రాజీనామా చేయాలా?

Published on Fri, 07/31/2026 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్‌ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా? ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చినందుకా? విద్యార్థులకు నైపుణ్యం అందించేందుకు స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్‌ అయిన కార్పొరేట్‌ సంస్థల యజమానులను స్కిల్స్‌ వర్సిటీ బోర్డు సభ్యులుగా నియమించినందుకా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఫిన్‌లాండ్, జర్మనీలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖాముఖి సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూళేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు.  

మొదటి తారీఖునే జీతాలు 
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయని సీఎం రేవంత్‌ అన్నారు.  ‘ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తెచ్చాం . విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్‌ ఫాస్ట్, లంచ్‌ అందిస్తున్నాం . పిల్లలు తల్లిదండ్రులకు స్ట్రెస్‌ బస్టర్స్‌ం. అందుకే డే స్కాలర్‌ విద్యార్థులకు కూడా బ్రేక్‌ ఫాస్ట్, లంచ్‌ అందిస్తున్నాం . సమాజంలో మానవ సంబంధాలు విచి్ఛన్నమైతే ఏ కుటుంబం, ఏ దేశం నిలబడదు.  తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల దగ్గరే పిల్లలు ఎక్కువ సమయం ఉంటారు. 

తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయులకూ అంతే బాధ్యత ఉంది . విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌లతో సమానంగా ఏటా 10–15 మంది టీచర్లను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిద్దాం. ఓట్లు, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదు.  నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యతతో పనిచేసుకుంటూ వెళ్తున్నా. నా సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి నుంచే దీక్ష తీసుకుని బయలుదేరండి’ అని ఉపాధ్యాయులకు చెప్పారు. 

విద్యార్థుల సమస్యలపై కొట్లాడండి 
‘ఇంగ్లిష్‌ ఒక్కటే ముఖ్యమనుకుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది?  25 ఏళ్లు అమెరికా వైపు చూశాం.ం ఇప్పుడు ఫోకస్‌ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్‌ లాంటి దేశాలపై . ఆ దేశాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం . ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు.. విద్యార్థుల సమస్యలపై కొట్లాడాలి. ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్‌ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి . నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచించండి . వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబరులోగా నివేదిక ఇవ్వండి . ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి ’ అని సీఎం చెప్పారు. 

ఒక్కో విద్యారి్థపై రూ.1.08 లక్షలు 
‘ప్రతీ పేదవాడికి విద్యతోపాటు వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలి . ఏ ఆస్తులు లేకపోయినా చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం . ఒక్కో విద్యారి్థపై ప్రభుత్వం రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోంది . ప్రైవేటు స్కూల్‌ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు దాదాపు రూ.50 వేలు.  ప్రభుత్వం ఎంతో వెచ్చిస్తున్నా తల్లిదండ్రులు ప్రైవేటు బడులకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి ’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

మోదీ చేసిన అప్పు రూ.151 లక్షల కోట్లు 
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి 2014 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు రూ.50 లక్షల కోట్లు  అని సీఎం రేవంత్‌ అన్నారు. 2014 నుంచి 2026 వరకు ప్రధాని మోదీ చేసిన అప్పు రూ.151 లక్షల కోట్లు అని చెప్పారు. ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు రూ.201 లక్షల కోట్లు  అని పేర్కొన్నారు. కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్‌ను సార్వ¿ౌమ దేశంగా మార్చిన వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.  సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎన్‌.శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ శాంతికుమారి పాల్గొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)