Breaking News

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులో యజమానిగా మహిళే

Published on Sun, 09/29/2024 - 04:27

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల్లో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డుల వెనుకభాగంలో ముద్రించాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు (ఎఫ్‌డీసీ)లపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల అంశంపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారుల బృందం... తమ అధ్యయనానికి సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచి్చంది.

కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రస్తుతమున్న రేషన్, ఆరోగ్యశ్రీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్డు ల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, పాన్‌ కార్డుల వంటి సమాచారం సేకరించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.  

ప్రతి నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రాంతాల్లో... 
ఎఫ్‌డీసీ కోసం సమాచార సేకరణ, వాటిల్లో ఏయే అంశాలు పొందుపరచడంతోపాటు మార్పుచేర్పుల వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందించాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందు లో జత చేయాల్సిన లేదా తొలగించాల్సిన అంశాల సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండేసి ప్రాంతాలను (ఒక గ్రామీణ, ఒక పట్టణ) పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని వచ్చే నెల 3 నుంచి కుటుంబాల నిర్ధారణ చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)