ప్రజాభవన్‌లో వైభవంగా బోనాలు

Published on Mon, 07/15/2024 - 03:45

లక్డీకాపూల్‌: ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం తెలంగాణ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ సలహా­దారు వేంరెడ్డి నరేందర్‌ రెడ్డి హాజరయ్యారు. ప్రజాభవన్‌కి విచ్చేసిన సీఎం, మంత్రులకు భట్టి దంపతులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.

 పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భట్టి దంపతులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నల్ల పోచమ్మ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశా రు. అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్‌ ఉత్తమ్‌ పద్మావతి, పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు బోనమెత్తారు. రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై ఎత్తారు.

డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్‌ ఆవరణలోని నల్ల పోచమ్మ దేవాల యం వరకు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యా సాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమరి్పంచారు. నల్ల పోచమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)