Breaking News

మేడారం: ఆధునీకరించిన గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్‌

Published on Mon, 01/19/2026 - 07:37

సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి రెండో రోజు పర్యటించారు. మంగళవారం వేకువ జామునే కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తొలిమొక్కును రేవంత్‌ దంపతులు చెల్లించుకున్నారు. తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) ఆయన సమర్పించారు. అంతకు ముందు.. ఆధునీకరించిన మేడారం గద్దెలను సీఎం ప్రారంభించారు. 

సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో నిర్మించిన నూతన సాలహారం, ద్వారాలు, ఆర్చీలను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. సీఎం, మంత్రులను పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలతో డోలు వాయిద్యాల నడుమ గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం అమ్మవార్లను దర్శించుకుని బంగారం(బెల్లం) ప్రసాదం స్వీకరించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారి నిన్న(ఆదివారం) మేడారంలో కేబినెట్‌ భేటీ నిర్వహించారు. అనంతరం మేడారం ఆలయ ఎగ్జిట్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం రేవంత్‌­రెడ్డి, మంత్రులు తిలకించారు. గిరిజన సంప్రదాయ నృత్యా­లు, ఆటపాటలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంత­రం హరిత హోటల్‌లో రాత్రి బస చేశారు. ఇవాళ(సోమవారం) ఉదయం సీఎం రేవంత్‌ సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలకు చీర, సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో హైదరా­బాద్‌కు బయలుదేరారు.

 


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)