Breaking News

సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన

Published on Wed, 08/05/2026 - 05:25

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 17 లేదా 18 అర్ధరాత్రి నుంచి సెపె్టంబరు 10 మధ్య నాలుగు దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగు దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో సీఎం బృందం పర్యటించనుంది. పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు కానున్నారు. ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులతోపాటు రాష్ట్రంలో విదేశీ యూనివర్సిటీలు, క్రీడలు, శిక్షణా సంస్థల భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఈనెల 16న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి 21ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం ఉండాలంటూ తీర్మానం చేసే అవకాశం ఉంది.

ఆ మరుసటి రోజు విదేశీ పర్యటనకు బయలుదేరే అవకాశముంది. హైదరాబాద్‌ నుంచి ముందుగా యూకేకు, అక్కడ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కూతురు నిఖా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహా్వనించే ప్రయత్నాలు జరగనున్నాయి. యూకే, అమెరికాలోని ప్రముఖ క్రీడా అకాడమీలు, శిక్షణా కేంద్రాలను సందర్శించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సలహాదారు కె.రామకృష్ణారావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)