Breaking News

13 నుంచి సీఎం రేవంత్‌ విదేశీ పర్యటన

Published on Fri, 01/03/2025 - 05:17

సాక్షి, హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13 నుంచి విదేశాల్లో పర్యటించను­న్నారు. 13న ఆస్ట్రేలియా వెళ్లనున్న ఆయన.. అక్కడ క్వీన్స్‌ల్యాండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడ క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

15న సీఎం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మళ్లీ ఈ నెల 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పర్యాటక పాలసీని ప్రకటించిన నేపథ్యంలో... సింగపూర్‌లో పర్యాటకాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తారు. 

ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకోవడానికి సింగపూర్‌ ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తోందన్న అంశాన్ని అధ్యయనం చేస్తారు. అనంతరం ఈ నెల 21 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. దావోస్‌ పర్యటనకు సీఎంతో పాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు వెళ్లనున్నారు.   

సీఎం రేవంత్‌ విదేశీ పర్యటన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)