Breaking News

‘న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌’ హైదరాబాద్‌లో

Published on Sun, 08/11/2024 - 04:54

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ‘రాజీవ్‌ పార్క్‌’ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పట్టణ ఉద్యానవనంగా పిలిచే న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌ తరహాలో రాజీవ్‌ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. దీంతో అనువైన ప్రాంతం, స్థల సమీకరణ కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పశ్చిమ హైదరా బాద్‌లో కొలువుదీరనున్న రాజీవ్‌ పార్క్‌లో సందర్శకులు సిటీ వ్యూ చూసేందుకు వీలుగా ఎత్తయిన అబ్జర్వేటరీ డెక్‌ కూడా ఏర్పాటు చేయా లనుకుంటున్నారు. రీ ఇమేజినింగ్‌ హైదరాబాద్‌ పేరిట ఇటీవల ఓ హోటల్‌లో సీఎం రేవంత్‌ నిర్వహించిన సమావేశంలో పలువురు బిల్డర్లతో ఈ అంశాన్ని వెల్లడించినట్లు తెలిసింది.

న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌ ఇలా..
న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో 843 ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌ ఉంది. అమెరికాలో తొలి ల్యాండ్‌స్కేప్‌ పార్క్‌ ఇదే. 2016 అంచనాల ప్రకారం ఏటా సుమారు 4.2 కోట్ల మంది పర్యాటకులు ఈ పార్క్‌ను సందర్శి స్తున్నారు. ఇందులో సినిమా షూటింగ్‌ స్పాట్లు, అభయారణ్యం, థియేటర్, ఫుడ్‌ జోన్స్, జూ, కిడ్స్‌ ప్లే ఏరియా వంటి వినోద కేంద్రాలు ఉన్నాయి. సైక్లింగ్, వాక్‌వేలు, ఇతరత్రా క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సంస్కృతీ సంప్రదాయాలు, చర్రితను తెలియజెప్పే విభిన్న ఆకృతులతో మాన్యుమెంట్స్‌ ఉన్నాయి.

బిలియనీర్ల కోసం 4,100 ఎకరాలు
రాజీవ్‌ పార్క్‌ చుట్టూ బిలియనీర్లు, అల్ట్రా లగ్జరీ ప్రముఖుల నివాస, వాణిజ్య సముదాయాల కోసం 4,100 ఎకరాలను అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. సాధారణంగా హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు, బహుళజాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీలు ఎక్కువగా ఉబర్‌ లగ్జరీ నివాస సముదాయాల్లో ఉండేందుకు ఇష్టపడతారు.

ఈ తరహా భవనాల్లో విశాలమైన లాంజ్‌లు, ఇంట్లోనే జిమ్, స్పా, సెలూన్, కట్టుదిట్టమైన భద్రత, ప్రైవేట్‌ ఔట్‌డోర్‌ స్పేస్, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వసతులుంటాయి. ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్‌ పార్క్‌ కార్యరూపంలోకి వస్తే ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉంటాయని స్థిరాస్తి నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంపన్న వర్గాలు ఎక్కువగా ఈ తరహా ప్రాంతాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో విలాసవంతమైన గృహాలు, ఆఫీసు భవనాలు వెలుస్తాయని చెబుతున్నారు.

చైనాలో అర కిలోమీటర్‌కన్నా ఎత్తైన అబ్జర్వేటరీ డెక్‌
⇒ ఎత్తయిన ప్రదేశం నుంచి సిటీ వ్యూ, సుదూర ప్రాంతాలను చూసేందుకు వీలుగా ఉండే ప్లాట్‌ఫామ్‌ను అబ్జర్వేటరీ డెస్క్‌ అంటారు. సాధారణంగా హైరైజ్‌ నివాస, వాణిజ్య సముదాయాలలో ఈ తరహా డెక్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుచూపు మేరలో సిటీ వ్యూ కనిపిస్తూ, ధారాళమైన గాలి, వెలుతురుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

అబ్జర్వేటరీ డెక్‌లు షాంఘై, దుబాయ్, మలేషియా, టోక్యో వంటి దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ డెక్‌ చైనాలోని షాంఘై టవర్‌లో ఉంది. 632 మీటర్ల (2,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ భవనంలో మొత్తం 128 అంతస్తులుంటాయి. 118వ అంతస్తులో అంటే 562 మీటర్లు (1,841 అడుగులు) ఎత్తులో అబ్జర్వేటరీ డెక్‌ ఉంది.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)