Breaking News

లబ్ధిదారులతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం

Published on Sun, 04/06/2025 - 17:18

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలోని సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సారపాకలో రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యరాలు తులసమ్మను ఆరా తీశారు సీఎం.

దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని సీఎం రేవంత్ కు  చెప్పిన తులసమ్మ.. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది.  200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు సీఎం రేవంత్. తమకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సంతోషకరంగా ఉందని తులసమ్మ చెప్పుకొచ్చారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగిలో రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గతంలో దొడ్డు బియ్యం పెట్టినప్పుడు దళారులు, రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడేవారని, ఇప్పుడు సన్నబియ్యంతో ఆ పరిస్థితి లేదన్నారు. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించిన రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)