Breaking News

రెండు బతుకమ్మ చీరలిస్తాం.. తూచ్‌, ఒక్కటే ఇస్తాం!

Published on Sat, 09/20/2025 - 13:45

షాద్‌నగర్‌: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి పేరిట అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక చీరలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారిగా బతుకమ్మ పండుగ చీరలు ఇవ్వాలని నిర్ణయించింది.

సభ్యత్వం ఉన్న మహిళలకు పంపిణీ
గత ప్రభుత్వ హయాంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేవారు. రేష నాకార్డులో పేరు ఉన్న 18 ఏళ్లు నిండిన మహి ళలకు వివిధ రంగుల్లో చీరలను అందించారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల్లో ఉన్న ప్రతీ సభ్యురాలికి దసరా కానుకగా రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి మహిళా సంఘాల సభ్యులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంతన్న కానుకగా ప్రతీ సంఘం సభ్యులకు చీరలను అందించనున్నారు. అయితే బతుకమ్మ పండగకు ముందుగా ఒక చీర ఆ తర్వాత రెండు నెలలకు మరో చీరను పంపిణీ చేయనున్నారు. 

ఒక్కో చీరకు రూ.800
గతాని కంటే భిన్నంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను తయారు చేయించిందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.800 ఖర్చు అయిందని అధికారులు తెలి పారు. జిల్లాకు ఇప్పటి వరకు 1.55 లక్షల చీరలు వచ్చాయని వీటిని సర్ధార్‌ నగర్‌ , కందు కూరు మార్కెట్ యార్డుల్లోని గోదాముల్లో నిల్వ ఉంచామని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయనున్నారు.

అర్హుల గుర్తింపు
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శలు, సీసీలు, గ్రామ సంఘం అధ్యక్షుడు, వీఓఏలు అర్హులను ఎంపిక చేసి అనంతరం చీరలను పంపిణీ చేయ నున్నారు. మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందికి, గ్రామ స్థాయిలో ఐకేపీ సిబ్బందికి చీరల పంపిణీ బాధ్యతలను అప్పగించనున్నారు.

పంపిణీకి ఏర్పాట్లు
దసరా కానుకగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు బతుకమ్మ చీరలను అం దజేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాకు ఇప్పటి వరకు 1,55 లక్షల చీరలు వచ్చాయి. వీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.
శ్రీలత, డీఆర్డీఏ పీడీ
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)