Breaking News

జైపాల్‌రెడ్డి చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం

Published on Sun, 07/27/2025 - 04:43

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నాయకుడు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన చొరవే కారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన జైపాల్‌రెడ్డి దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్‌ ఫర్‌ హైయ్యర్‌ ఎడ్యుకేషన్, కేపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో.. రచయిత, ఆర్థిక నిపుణులు మోహన్‌ గురుస్వామికి ‘ఎస్‌.జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు’ను ప్రదానం చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు.  

తెలంగాణలో పీవీ తర్వాత జైపాల్‌రెడ్డే.. 
జైపాల్‌రెడ్డి పాత్ర లేకపోతే ఇవాళ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదని రేవంత్‌రెడ్డి చెప్పారు. చర్చ లేకుండానే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా ఆయన ప్రత్యేక పాత్ర పోషించారని, జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియాగాంధీ కూడా ఒక సందర్భంలో తనతో చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప.. పదవుల కోసం ఆయన ఎన్నడూ పారీ్టలు మారలేదని చెప్పారు. పెట్రోలియం శాఖ మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని, సమాచార శాఖ మంత్రిగా ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారని గుర్తు చేశారు.

పార్లమెంటులో రాణించిన వాజ్‌పేయి మొదలుకుని అనేకమంది మేధావుల్లో ఎవరితోనూ జైపాల్‌రెడ్డికి వ్యక్తిగత వైరం లేదని, చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో పీవీ నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్న నాయకుడు జైపాల్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక నిలువెత్తు శిఖరం అని, పీవీ, జైపాల్‌రెడ్డి లాంటి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలని చెప్పారు.

ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్‌ 
పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపైనే జైపాల్‌రెడ్డి ఎక్కువ ఆలోచించేవారని, రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ప్రయత్నించారని రేవంత్‌ చెప్పారు. అయితే నాటి ఐడియాలజికల్‌ పాలిటిక్స్‌ పోయి ఇవాళ స్విగ్గీ పాలిటిక్స్‌ వచ్చాయని, దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్‌మెంట్‌ పాలిటిక్స్‌ వచ్చాయని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని, యూనివర్సిటీల్లో విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు’అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు శస్మిత్‌ పాత్రా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్‌ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌.ఎస్‌.గణేశ్, కేపిటల్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను ప్రదానం చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)