Breaking News

కలెక్టర్‌ గారూ తెలుగులో మాట్లాడండి..

Published on Fri, 11/21/2025 - 02:08

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అనర్గళంగా తెలుగులో మాట్లాడిన తీరు సోషల్‌ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి బుధ వారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా ఇంగ్లిష్ లో వివరిస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని ‘కలెక్టర్‌ గారూ.. తెలుగులో మాట్లాడండి.. తెలుగు వచ్చుకదా.. అన్ని జిల్లాల మహిళా సంఘాల మహిళలు ఉన్నారు.

వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి’అని నవ్వుతూ అన్నారు. దీంతో కలెక్టర్‌ వెంటనే తెలుగు వస్తుంది సార్‌.. కచ్చితంగా మాట్లాడుతా అంటూ జిల్లాలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ విధానం, ఇతర వివరాలను తెలుగులో అనర్గళంగా వివరించారు. అన్ని జిల్లాల సమాఖ్యల మహిళలు సిరిసిల్ల జిల్లాకు వచ్చి చీరల ఉత్పత్తిని చూసి, నాణ్యతను చూసి సంతోషపడ్డారని చెప్పారు. సిరిసిల్లలో మరో వారంలో చీరల ఉత్పత్తి పూర్తవుతుందన్నారు. బుధవారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ తెలుగు ప్రసంగం గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)