Breaking News

డిసెంబర్‌లోగా 50 టీఎంసీల నిల్వ!

Published on Sun, 04/06/2025 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి దశను ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్‌ (6.40టీఎంసీలు), ఏదుల (6.55 టీఎంసీలు), వట్టెం (16.7 టీఎంసీలు), కరివేన (19 టీఎంసీ లు) రిజర్వాయర్‌ల పనులు పూర్తి చేసి డిసెంబర్‌ నాటికి 50 టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేసుకునేందుకు సర్వం సిద్ధం చేయా లని ఆదేశించారు. 

ప్యాకేజీ–3 కింద నార్లాపూర్‌–ఏదుల రిజర్వాయర్ల మధ్య కాల్వల పనులను తక్షణమే ప్రారంభించి అక్టోబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖపై శనివారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రియదర్శిని జూరాల జలాశయంలో పూడికను తొలగించి నిల్వ సామర్థ్యాన్ని 12 టీఎంసీలకు పునరుద్ధరించాలని ఆదేశించారు.  

సెక్రటరీ ఇంటికి వెళ్లి సంతకం చేయించండి 
‘శ్రీరామనవమి సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాచలంలో పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణకు పరిపాలనాపర అనుమతులతో తక్షణమే జీవో జారీ చేయండి’అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్షలో ఆదేశించారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జాకి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని తెలిపేందుకు అధికారులు ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. 

సెక్రటరీ ఫోన్‌ ఎత్తడం లేదని అధికారులు చెప్పగా.. సెక్రటరీ ఇంటికి వెళ్లి ఫైల్‌పై సంతకం చేయించి ఈ రోజే జీవో ఇవ్వాలని ఉత్తమ్‌ ఆదేశించినట్టు తెలిసింది. శనివారం సెలవు కావడంతో సమావేశానికి సెక్రటరీ రాలేకపోయారని సమాచారం. భద్రాచలం పర్యటనలో సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ సమీక్ష చేసే అవకాశం ఉంది.  

ఇన్‌లెట్‌వైపు నుంచే బ్లాస్టింగ్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ఇన్‌లెట్‌వైపు నుంచి మాత్రమే డ్రిల్లింగ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో తవ్వకాలకు అనుమతిస్తామని, మన్నెవారిపల్లి (అచ్చంపేట) వద్ద ఉన్న అవుట్‌లెట్‌ వైపు నుంచి ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. సొరంగాన్ని రెండు వైపుల నుంచి డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో తవ్వకాలు జరిపేందుకు అనుమతించాలని నిర్మాణ సంస్థ జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ చేసిన విజ్ఞప్తిని మంత్రి తోసిపుచ్చారు. 

ఇన్‌లెట్‌ వైపు నుంచి టీబీఎంతో సొరంగంలో తవ్వకాలు జరుపుతుంటే పైకప్పుకూలి 8 మంది కూలీలు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌లెట్‌వైపు నుంచే డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో తవ్వకాలకు అనుమతిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)