Breaking News

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

Published on Tue, 12/03/2024 - 03:57

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో హిందూస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) అత్యాధునిక గ్రీన్‌ ఫీల్డ్‌ ఫ్యాక్టరీని సీఎం రేవంత్‌ సోమవారం ప్రారంభించారు. పరిశ్రమలో కలియతిరిగి పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. పరిశ్రమ ద్వారా వచ్చే ఉద్యోగాలతోపాటు పరోక్ష ఉపాధితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 

పారిశ్రామిక వృద్ధి దిశగా చర్యలు
హెచ్‌సీసీబీ పెట్టుబడులు ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ కలిసి సాగుతాయనే దానికి ఉదాహరణ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల సమ్మిళిత వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. 

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఫ్యాక్టరీ ఉదాహరణ అని చెప్పారు. కగా.. హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్‌ సీఈవో జువాన్‌ పాబ్లో రోడ్రిగ్జ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నీటి పైప్‌లైన్‌ను త్వరగా పూర్తి చేసిందని, తెలంగాణ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటామని చెప్పారు. హెచ్‌సీసీబీ తెలంగాణలో రూ.3,798 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికిపైగా ఉపాధి అవకాశాలను కల్పించిందని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)