Breaking News

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి

Published on Tue, 06/17/2025 - 01:08

సాక్షి, హైదరాబాద్‌: జూలైలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వారు గమనిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మంత్రులతో, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో సీఎం 45 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు.

జరగని నిర్ణయాలను ముందుగానే ప్రకటించడం వల్ల ప్రజల్లో పలుచన అవుతామని స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సుతిమెత్తగా మందలించారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మంత్రులు టార్గెట్‌లు పెట్టుకుని మరీ పని చేయాలని, స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న కొండా సురేఖ మినహా మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు.  

ఎన్ని ఎకరాలున్నా రైతుభరోసా!: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులతో రేవంత్‌ చర్చించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెలాఖరు వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

రైతు భరోసా విషయంలో రాజీ పడేది లేదని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతున్నందున ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా వేద్దామని ఆయన అన్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల గురించి బయట మాట్లాడేదాని కంటే, ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించడంపైనే దృష్టి పెట్టాలని అన్నట్టు తెలిసింది. జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని, బీఆర్‌ఎస్‌ బలం కొద్దో గొప్పో ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి పనిచేయాలని సూచించారని సమాచారం.  

బనకచర్లపై కేంద్రంతో తేల్చుకుందాం.. 
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రంతోనే తేల్చుకుందామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజబులిటీ నివేదికను సమర్పించడం, దానికి డీపీఆర్‌ను సమర్పించాలని కేంద్రం కోరడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బనకచర్లకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వద్దామని అన్నట్లు తెలిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)