Breaking News

అల్లు అర్జున్‌కు కంగ్రాట్స్‌: సీఎం కేసీఆర్‌

Published on Sat, 08/26/2023 - 18:22

హైదరాబాద్‌: 69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం‍ద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్‌ను సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

తాజాగా.. రెండు రోజుల కిందట 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు సుకుమార్‌డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ పార్ట్‌ 1 చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ దక్కించుకున్న తొలి యాక్టర్‌గా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు అవార్డులతో రాజమౌళి మల్లీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నెగ్గింది. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి.

జాతీయ అవార్డ్​ విజేతలకు దక్కే ప్రైజ్​మనీ ఎంతో తెలుసా?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)