Breaking News

2047కి తెలుగుజాతి ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలవాలి

Published on Sat, 01/04/2025 - 04:43

హైదరాబాద్‌: 2047నాటికి తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలవాలని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహసభల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరల్డ్‌ తెలుగు ఫెడరేషన్‌ సావనీర్‌ , తెలుగు ఏంజిల్స్‌ పేరుతో స్టార్టప్‌ లోగోను ఆయన ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలుగువారికి బిజినెస్‌ అవార్డులను అందించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ప్రపంచంలోని తెలుగువారంతా భాగస్వాములు కావాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికంటే విదేశాల్లో ఉన్న తెలుగు వారే భాష, సంప్రదాయాలను కాపాడుతున్నారని చెప్పారు. అమెరికాలో ఎక్కువ తలసరి ఆదాయం పొందుతున్నది తెలుగువారేనని చెప్పారు. ఏ దేశం వెళ్లినా ఆ దేశంలో ఆమోదం రావాలంటే అక్కడి ప్రజలకు సేవలందించాలన్నారు. 

అయినా మాతృదేశాన్ని, జన్మభూమిని, కర్మభూమిని మరిచిపోవద్దని అన్నారు. పారిశ్రామికవేత్తగా సంపాదించిన డబ్బును మరింతమందికి ఉపాధి  కల్పించేందుకు ఉపయోగించాలని అన్నారు. ప్రపంచంలోనే తెలుగువారికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించారన్నారు. తెలుగుభాషకు వన్నె తెచ్చిన గిడుగు రామ్మూర్తిని  స్మరించుకోవాలన్నారు. 

పీవీ నరహింహరావు, వెంకయ్యనాయుడు , కోకా సుబ్బారావు, జస్టిస్‌ రమణ, నీలం సంజీవరెడ్డి, బాలయోగి వంటి తెలుగువారు ఉన్నత పదవుల్లో రాణించారన్నారు. కరణం మల్లీశ్వరీ, పుల్లెల గోపీచంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వీవీఎస్‌ లక్ష్మణ్, పీవి సింధు, పెండ్యాల హరికృష్ణ, వెంకటపతిరాజు వంటి ఎందరో తెలగువారు క్రీడల్లో సత్తాను చాటారని చెప్పారు.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)