Breaking News

త్వరలో పీఆర్‌సీ, ఐఆర్‌పై స్పష్టత

Published on Fri, 08/04/2023 - 03:07

సాక్షి, హైదరాబాద్‌: రెండో వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి మధ్యంతర భృతిని ప్రకటించా లని తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమి టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి వి.మమత తదితరు లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో కేసీఆర్‌ను కలిశారు.

పీఆర్‌సీ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటన ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగుల చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

తాము సమర్పించిన వినతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని, రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మామిళ్ల రాజేందర్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో టీజీఓల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టీఎన్‌జీఓల యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ సత్యనారాయణగౌడ్‌ ఉన్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)