Breaking News

మావోయిస్టుల ఇలాకాలో కార్ఖానాలు

Published on Sun, 08/10/2025 - 05:01

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులపై ముప్పేట దాడితో విరుచుకుపడుతోన్న కేంద్ర ప్రభుత్వం వారి కట్టడికి చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్రం.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు రక్షణ కల్పించేందుకు ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసింది. సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో కొత్త రక్తం నింపేందుకు భారీగా రిక్రూట్‌మెంట్లు చేపట్టనుంది. 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నూతన పారిశ్రామిక పాలసీని ప్రకటించింది. ఈ క్రమంలో ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు భద్రత కల్పిస్తామని చెబుతున్న కేంద్రం పెట్టుబడులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెబుతోంది. అందులో భాగంగా ప్రత్యేక బలగాల స్థానంలో సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ (సీఐఎస్‌ఎఫ్‌)ను రంగంలోకి దించుతోంది. 

సీఐఎస్‌ఎఫ్‌పై సీలింగ్‌ ఎత్తివేత.. 
ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న జవాన్ల సంఖ్య 1.25 లక్షలకు అటూఇటుగా ఉంది. పహల్గాం ఘటన తర్వాత కొత్తగా 13వేల మందిని చేర్చుకోగా మరో 24వేల మంది నియామక ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. సీఐఎస్‌ఎఫ్‌కు సంబంధించి 1.62 లక్షల పోస్టుల వరకే సీలింగ్‌ ఉంది. తాజాగా బస్తర్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు దీన్ని జూలై 22న కేంద్రం సవరించింది. మొత్తంగా 2.20 లక్షల మంది కానిస్టేబుళ్లు/జవాన్లను నియామకానికి సీఐఎస్‌ఎఫ్‌కు అవకాశం కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో ఏటా 14వేల మందికి మించకుండా మొత్తం 58 వేల మంది సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు బస్తర్‌ అడవుల్లో అడుగుపెట్టనున్నారు. 

ఇప్పటికే ఇక్కడ పారిశ్రామిక పురోగతి, ఖనిజాల రవాణా కోసం మల్కాన్‌గిరి–భద్రాచలం రైల్వే మార్గానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, చాన్నాళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన కొత్తగూడెం–కిరండోల్‌ రైలు మార్గం ఫైనల్‌ లోకేషన్‌ సర్వేకూ పచ్చా జెండా ఊపింది. అంతేకాక కిరండోల్‌–బీజాపూర్‌–రామగుండం వరకు కొత్త మార్గానికి సర్వే చేపడుతోంది. వీటికి రక్షణతో మొదలయ్యే సీఐఎస్‌ఎఫ్‌ విధులు ఆ తర్వాత రాబోయే పరిశ్రమలకూ భద్రత కల్పించనున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)