Breaking News

మీరెందుకు ప్రచారం చేశారు?

Published on Wed, 11/12/2025 - 05:00

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సీఐడీ సిట్‌ ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. మంగళవారం విజయ్‌ దేవరకొండ సీఐడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 

‘బెట్టింగ్‌ యాప్‌ల తరఫున మీరెందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్‌ ప్రమోట్‌ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్‌లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు?’అని విజయ్‌ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల సమయంలో సీఐడీ కార్యాలయంలోకి వెళ్లిన విజయ్‌ని అధికారులు గంటకుపైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించి నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. 

బెట్టింగ్‌ యాప్‌ల వైపు ప్రోత్సహించేలా యాడ్స్‌ చేయడం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గుర్తించారా? అంటూ ప్రశ్నించినట్టు ఓ అధికారి తెలిపారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు విజయ్‌ సమాధానమిచ్చినట్టు తెలిసింది. కాగా, ఇదే కేసు దర్యాప్తులో భాగంగా బిగ్‌బాస్‌ ఫేం సిరి హనుమంత్‌ను సైతం అధికారులు ప్రశ్నించారు. 

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌కు ఆమె భారీగా పారితోషికం తీసుకున్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలిసింది. గోవిందా 365 అనే బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోట్‌ చేసిన సిరి హనుమంత్‌ను అందుకు సంబంధించిన వివరాలు అడిగి నట్టు సమాచారం. 

నేడు సీఐడీ ఎదుటకు ప్రకాశ్‌రాజ్‌ 
బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసు దర్యాప్తులో భాగంగా నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సైతం సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున తమ ఎదుట హాజరుకావాలని చెప్పారు. సమన్ల మేరకు ప్రకాశ్‌రాజ్‌ బుధవారం ఉదయం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నట్టు సమాచారం. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు