Breaking News

బొమ్మ దొరికిందోచ్‌..!

Published on Sat, 01/07/2023 - 01:57

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరకడం అరుదు. అలాంటి ఓ వస్తువును రైల్వే అధికారులు స్వయంగా ఇంటికే వచ్చి బాధితులకు అప్పగిస్తే..! పైగా, అది ఓ చిన్నారికి ఎంతో ఇష్టమైన బొమ్మ అయితే...! ఆ బొమ్మను తిరిగి పొందిన ఆ చిన్నారి ఆనందానికి అవధులు ఉంటాయా..? ఉండవనే చెప్పవచ్చు. సికింద్రాబాద్‌ నుంచి అగర్తలాకు (07030) వెళ్లే రైలులో ఈ నెల 4న ప్రయాణం చేస్తున్న భూసిన్‌ పట్నాయక్‌ అనే ప్రయాణికుడి ఎదురు సీట్లో ఉన్న ఓ చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకొంది.

దాని కోసం దిగాలుగా ఏడుస్తున్న ఆ చిన్నారికి ఎలాగైనా దానిని అందించాలనే ఉద్దేశంతో భూసిన్‌ రైల్వే మదద్‌ యాప్‌ ద్వారా 139 నంబర్‌కు ఫోన్‌ చేసి విషయాన్ని చేరవేశారు. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారి వివరాలను సికింద్రాబాద్‌ రైల్వే కౌంటర్‌ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ సిబ్బంది ఆ బొమ్మ ఆచూకీ కోసం ఆరా తీసి, న్యూ జల్ఫాయ్‌గురి స్టేషన్‌ దగ్గర్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లా అలియాబరి స్టేషన్‌కు 20 కిలోమీటర్‌ల దూరంలో ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులు మోహిత్, నస్రీన్‌ బేగంలను కలిసి ఆ బొమ్మను అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వేమంత్రికి, అధికారులు, సిబ్బందికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)