Breaking News

చట్టబద్ధతే దత్తతకు మార్గం!

Published on Thu, 02/27/2025 - 10:42

సాక్షి, హైదరాబాద్: అమ్మా, నాన్న అనే పిలుపు కోసం తపన.. తల్లినయ్యానంటూ చెప్పాలనే కోరిక.. తండ్రిగా బిడ్డ వేలుపట్టి నడిపించాలనే తహతహ కొందరు దంపతులను అక్రమ మార్గంలో నడిచేలా చేస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా, చికిత్సలు చేయించుకున్నా వేధిస్తున్న సంతానలేమి సమస్యలు, వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో సమాజంలో చిన్నచూపు, చట్టబద్ధంగా పిల్లల దత్తతకు(Child Adoption) ఏళ్ల కాలం పాటు పట్టే సమయం వెరసీ.. దళారుల మాటలు నమ్మేలా చేస్తున్నాయి. 

విద్యావంతులు, గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వారు సైతం అక్రమ మార్గంలో పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులకు నవజాత శిశువులను విక్రయిస్తున్న రెండు ముఠాలను మంగళవారం రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా పిల్లలను విక్రయించే నేరస్తులపైనే కాదు శిశువులను కొనుగోలు చేసిన బాధిత తల్లిదండ్రుల పైనా  పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా పిల్లల దత్తత ఎంత అవసరమో ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి. 

జాతీయ స్థాయిలో ‘కారా’.. 
పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడానికి జాతీయ స్థాయిలో ‘కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ’ (కారా) పని చేస్తోంది. ఈ ఏజెన్సీ కింద రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీలు పని చేస్తాయి. అసహాయ పరిస్థితులు, ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన, అప్పగించిన పిల్లలను శిశు సంక్షేమశాఖ అధికారులు చేరదీస్తారు. వీరినే దత్తత ఇస్తారు. ఈ మేరకు రాష్ట్రస్థాయిలో శిశువిహార్, జిల్లా స్థాయిలో శిశుగృహాలు ఉన్నాయి. వీటిల్లో ఆరేళ్లలోపు చిన్నారులకు మాత్రమే సంరక్షణ ఉంటుంది. ఆరేళ్లు దాటితే శిశుగృహాల నుంచి బాలసదన్‌కు పంపించి చదువు నేరి్పస్తారు. చిన్నారుల దత్తత కోసం నమోదు చేసుకున్నాక వచి్చన సీనియారిటీ, పిల్లల వయసు, ఆడ, మగ, ఆరోగ్యం తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే దత్తతకు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. 

బంధువుల పిల్లల దత్తతకూ అనుమతి తప్పనిసరి.. 
ఇలాంటి చిన్నారులే కాదు బంధువుల పిల్లలను దత్తత తీసుకోవాలన్నా ‘కారా’ ద్వారా అనుమతి పొందాల్సిందే. దంపతుల వయసు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తత ఇస్తారు. కనీసం రెండేళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్న వారే అర్హులు. సింగిల్‌ పేరెంట్‌ అయితే మహిళ మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హురాలు. పురుషులు దత్తత తీసుకోవడానికి చట్టం అనుమతించదు. కేరింగ్స్‌ పోర్టల్స్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న దంపతులు కుటుంబ పరిస్థితులు, తనిఖీ చేసిన అనంతరం జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) నివేదిక అందిస్తుంది. అనంతరం ‘కారా’ ప్రాథమిక అనుమతి లేఖను ఇస్తుంది. అప్పుడు డీసీపీయూ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఈ వివరాలన్నీ పరిశీలించాక జిల్లా కలెక్టరు దత్తత ఆదేశాలు జారీచేస్తారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)