Breaking News

నూరు శాతం వర్సిటీల ప్రక్షాళన

Published on Sun, 11/03/2024 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయా­లను నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొంతకాలంగా యూనివర్సిటీలపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని.. వాటిల్లోని పలు వ్యవస్థలు దెబ్బతి­న్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

వర్సి­టీల గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత వైస్‌ చాన్స్‌లర్లపైనే ఉందన్నారు. ఇటీవల నియమితు­లైన వివిధ యూనివర్సిటీల వీసీలతో సీఎం రేవంత్‌ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశ­మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, సామాజిక సమీకరణాల ఆధారంగానే విశ్వ­వి­ద్యా­ల­యాలకు వైస్‌ చాన్స్‌లర్లను ఎంపిక చేశామని.. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రభావితాలు లేవన్నారు. 

వర్సిటీల్లో దెబ్బతిన్న వ్యవస్థల పునరు­ద్ధ­రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని వీసీలకు సూచించారు. ప్రస్తుత పరిస్థి­తులను పరిశీలించి అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని అధ్యయనం చేపట్టి నివేదిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి..
‘గతంలో వీసీలను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపె­ట్టు­కొనేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా ప్రభు­త్వం మీకు స్వేచ్ఛ ఇస్తోంది. మంచిపనులు చేసేందుకు సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. తప్పు జరిగితే మాత్రం ఆశ్చర్యక­రమైన నిర్ణయా­లు తీసుకోవాల్సి వస్తుంది. 

వర్సిటీ­ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టిపెట్టండి. విద్యార్థులను ఎప్పటిక­ప్పుడు గమనిస్తూ కౌన్సెలింగ్‌ ఇవ్వండి’ అని సీఎం రేవంత్‌ వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకి­ష్టారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)