Breaking News

ఇక్కడ చికెన్‌ చీప్‌!

Published on Sun, 02/09/2025 - 07:55

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోరోజువారీ ధరల ప్రకారం చికెన్‌ అమ్మకాలు సాగుతుంటే, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాత్రం మార్కెట్‌ రేట్‌ కన్నా కిలోకు రూ.30 తక్కువకు విక్రయిస్తుంటారు. ఎక్కడా కనిపించని పోటీ కామారెడ్డిలోనే ఉంటుంది. నాలుగైదేళ్ల కిందట మొదలైన పోటీ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇక్కడి దుకాణాల నిర్వాహకులు పేపర్‌ రేట్‌ కన్నా రూ.30 తక్కువ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ విక్రయాల్లో పోటీ పడుతుంటారు. 

ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి మరీ చికెన్‌ కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లకు క్వింటాళ్ల కొద్దీ చికెన్‌ కొనుగోలు చేస్తారు. సాధారణంగా పేపర్‌లో వచ్చే ధరల ప్రకారమే రాష్ట్రమంతటా చికెన్‌ అమ్ముతారు. అక్కడక్కడా ఐదో, పదో రూపాయలు తగ్గించి అమ్ముతారు. కానీ కామారెడ్డిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. కొందరు పేపర్‌ ధర కన్నా కిలోకు రూ.30 తక్కువకు అమ్ముతుండగా, ఇంకొందరు రూ.35 నుంచి రూ.40 తక్కువ కూడా విక్రయిస్తుంటారు.

గురువారం పేపర్‌ ధర ప్రకారం స్కిన్‌తో చికెన్‌ ధర కిలోకు రూ.181 ఉండగా, కామారెడ్డిలో రూ.150కి అమ్మారు. అంటే కిలోకు రూ.31 తక్కువగా విక్రయించారు. అలాగే స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో పేపర్‌ ధర ప్రకారం రూ.206 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి అమ్మారు. అంటే కిలోకు రూ.26 తక్కువకు అమ్మినట్లు స్పష్టమవుతోంది. లైవ్‌ బర్డ్‌ ధర కిలోకు రూ.128 ఉండగా, ఇక్కడ రూ.120కి అమ్ముతారు. మొత్తంగా ఏ దుకాణానికి వెళ్లినా మార్కెట్‌ ధర కన్నా తక్కువకే దొరుకుతుంది. 

టన్నుల కొద్దీ అమ్మకాలు.. 
కామారెడ్డి మార్కెట్‌లో నిత్యం 10 టన్నుల నుంచి 15 టన్నుల వరకు చికెన్‌ అమ్ముతుంటారు. ఆదివారం రోజైతే 40 టన్నుల నుంచి 50 టన్నుల వరకు అమ్ముడవుతోంది. వివిధ పౌల్ట్రీ సంస్థలు ఇక్కడ హోల్‌సేల్‌గా షాపులకు కోళ్లను సప్లై చేస్తాయి. కొందరు చికెన్‌ సెంటర్ల నిర్వాహకులకు సొంతంగా పౌల్ట్రీఫామ్‌లు కూడా ఉన్నాయి. 

ఇక్కడ కార్పొరేట్‌ సంస్థలకు చెందిన కోళ్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల మధ్యన నెలకొన్న పోటీ మూలంగా కొనుగోలుదారులకు తక్కువ ధరకు చికెన్‌ లభిస్తోంది. రెగ్యులర్‌గా చికెన్‌ కొనుగోలు చేసే హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు మరింత తక్కువ ధరలకు అమ్ముతామని వ్యాపారులు చెబుతున్నారు.  

చుట్టుపక్కల మండలాల్లో ఎక్కువ ధరలకు.. 
కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మండలాలు, గ్రామాల్లో పేపర్‌ ధరకే చికెన్‌ అమ్ముతారు. కొన్ని చోట్ల పేపర్‌ ధర కన్నా ఎక్కువకే అమ్ముతుంటారు. కామారెడ్డి లో ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక్కడ ఎక్కువ ఎందుకని ఎవరైనా వినియోగదారులు చుట్టుపక్కల మండలాల్లో వ్యాపారులను ప్రశ్నిస్తే.. అక్కడి ధర అక్కడే, ఇక్కడి ధర ఇక్కడే అని విక్రయదారులు చెబుతారు. ఈ నేపథ్యంలో కిలో, రెండు కిలోలు తీసుకునేవాళ్లు అందుబాటులో ఉన్న దుకాణాల్లో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తారు. అదే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగల కోసం ఎక్కువ మొత్తంలో చికెన్‌ అవసరమైనపుడు మాత్రం కామారెడ్డిలో కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో కొంటే మరింత తక్కువ ధరకు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది ఆటోలు, వ్యాన్లలో వచ్చి చికెన్‌ తీసుకుని వెళుతుంటారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)