Breaking News

అంతులేని విషాదం

Published on Tue, 11/04/2025 - 09:42

తాండూరు: చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరులో మహా విషాదాన్ని నింపింది. సోమవారం తెల్లవారు జామున 4.40 గంటలకు తాండూరు డిపో నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలు దేరింది. అలా బయలుదేరిన రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తాండూరు నియోజకవర్గానికి చెందిన 14 మంది మృత్యువాత పడ్డారు. అందులో 10 మంది మహిళలు, ముగ్గురు పురుషులు, రెండు నెలల శిశువు ఉన్నారు. 

తాండూరులో ఉంటున్న పేర్కంపల్లికి చెందిన ఒకే కుంటుబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు తనూష, సాయిప్రియా, నందిని ప్రమాదంలో చనిపోయారు. పట్టణానికి చెందిన సాలేహా, రెండు నెలల శిశువు, విశ్వంబర కాలనీకి చెందిన తబస్సుమ్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిల ప్రాణాలు కోల్పోయారు. యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన లక్ష్మి, బందెప్ప దంపతులు, కరన్‌కోట్‌ గ్రామానికి చెందిన ముస్కాన్‌ బేగం మృత్యువాత పడ్డారు. 

బస్సు డ్రైవర్‌ దస్తగిరి కూడా మృత్యువాత పడ్డారు. తాండూరు పట్టణం వాల్మీకి నగర్‌కు చెందిన వెంకటమ్మ అలియాస్‌ స్వాతి(22) మృతి చెందారు. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసిన బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక్కడికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఎక్కడ చూసినా బస్సు ప్రమాదం గురించే మాట్లాడుకోవడం కనిపించింది.   

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)